కల్తీ మద్యానికి 21మంది బలి
ABN, First Publish Date - 2022-12-15T03:23:07+05:30
బిహార్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది మృత్యువాతపడ్డారు. శరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకు వీరంతా మద్యం సేవించారు. అక్కడినుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే తీవ్ర
మరికొందరి పరిస్థితి విషమం
శరన్ జిల్లా ఛాప్రాలో ఘోరం
ఆరేళ్లుగా బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం
అయినా మరణాలా?.. దద్దరిల్లిన అసెంబ్లీ
నితీశ్ క్షమాపణ చెప్పాలి.. బీజేపీ డిమాండ్
తాగొచ్చి అల్లరా?.. నితీశ్ అసహనం
పట్నా, డిసెంబరు 14 : బిహార్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది మృత్యువాతపడ్డారు. శరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకు వీరంతా మద్యం సేవించారు. అక్కడినుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే, ఆరేళ్లుగా మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. సీఎం నితీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు జరిపిన ఆందోళనలతో బుధవారం అసెంబ్లీ లోపల, బయటా తీవ్ర ప్రకంపనలు రేగాయి. నితీశ్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభ స్తంభించిపోయింది. ఒకదశలో నితీశ్ సహనం కోల్పోయారు. ‘తాగొచ్చి సభలో అల్లరి చేస్తున్నారా?’ అంటూ బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. కాగా, పోలీసులు, కల్తీ మద్యం వ్యాపారుల మధ్య లాలూచీ ఫలితంగానే తరచూ జనం చనిపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నా మంచి జరిగినప్పుడు స్వాగతిస్తాం. రాష్ట్రంలో 2016లో మద్యనిషేధం విధించినప్పుడు మేం విపక్షంలో ఉండి కూడా మద్దతు ఇచ్చాం. కానీ, నిషేధం అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది’’ అని తాజా మాజీ డిప్యూటీ సీఎం తార్‌కిశోర్ ఆరోపించారు.
Updated Date - 2022-12-15T03:23:08+05:30 IST