ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shruti Haasan: అంతర్జాతీయ ప్రాజెక్టులో ఛాన్స్

ABN, First Publish Date - 2022-10-22T19:54:04+05:30

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే శ్రుతి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రుతినే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

ఇంటర్నేషనల్ మూవీ ‘ది ఐ’ (The Eye)లో శ్రుతి హాసన్ నటించనుంది. ‘ది లాస్ట్ కింగ్‌డమ్’ ఫేమ్ మార్క్ రౌలీ (Mark Rowley) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘నేను గ్రీస్‌లో ఎందుకు ఉన్నానో మీకు తెలుసా. ఆసక్తికరమైన ప్రాజెక్టులో నేను భాగం అయ్యాను. ఈ శుభవార్తను మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని శ్రుతి హాసన్ చెప్పింది. ఓ దీవిలో మరణించిన భర్త అస్థికల కోసం అక్కడికి వెళ్లిన వితంతువుకి ఎదురైన ఘటనలు ఏంటనేది సినిమా కథగా తెలుస్తోంది. ‘ది ఐ’ లో అన్నా సవ్వా (Anna Savva), లిండా మార్లో (Linda Marlowe), క్రిస్టోస్ స్టెర్గియోగ్లౌ (Christos Stergioglou) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక శ్రుతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన ‘సలార్’ (Salaar) లో నటిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం రూపొందుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ‘కెజియఫ్’ మేకర్స్ సినిమాను నిర్మిస్తుండటంతో ‘సలార్’ పై భారీ అంచనాలున్నాయి.

Updated Date - 2022-10-22T19:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising