ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: బలూచిస్తాన్‌లో పేలుడు...13మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-12-20T06:59:21+05:30

పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి పేలుడు ఘటన జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలూచిస్తాన్‌: పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి పేలుడు ఘటన జరిగింది. బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ జిల్లాలోని ఉమర్ ఫరూక్ చౌక్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడులో కనీసం 13 మంది గాయపడ్డారని పాక్ పోలీసు అధికారులు తెలిపారు.(Balochistans Khuzdar) పేలుడు పదార్థాలు మోటారుసైకిలులో పెట్టారని ఖుజ్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముహమ్మద్ జాన్ ససోలీ చెప్పారు.(Pakistan) క్షతగాత్రులను ఖుజ్దార్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని చుట్టుముట్టారని ససోలి తెలిపారు.ఈ పేలుడులో(Blast) గాయపడిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది.

పేలుడుకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఖుజ్దార్ నగరంలో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.పేలుడు ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో (Balochistan Chief Minister Abdul Quddus Bizenj)ఖండించారు. నగరంలోని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ‘‘అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు దేశానికి శత్రువులు. ఈ రక్తపాతానికి ఏ మతం లేదా సమాజం అనుమతి ఇవ్వదు’’ అని అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు.నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలని ఖుజ్దార్ హైవే వద్ద భద్రతను పెంచాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. గాయపడిన వ్యక్తులకు ఉత్తమ చికిత్సను అందించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2022-12-20T07:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising