ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

International Students day: అంతర్జాతీయ విద్యార్థులమధ్య స్నేహసంబంధాలు పెరగాలంటే..!

ABN, First Publish Date - 2022-11-17T14:23:54+05:30

సాంస్కృతిక విభజనలలో అడ్డంకులను తొలగించి, బంధాలను ఏర్పరచుకునేందుకే ఈ రోజును జరుపుకుంటారు.

International Students day
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులందరికీ విద్య విలువను తెలియ చెప్పడానికి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నవంబర్ 17 న, జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల విజయాలు, సహకారాన్ని గౌరవించటానికి.., సాంస్కృతిక విభజనలలో అడ్డంకులను తొలగించి, బంధాలను ఏర్పరచుకునేందుకే ఈ రోజును జరుపుకుంటారు. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, వర్శిటీల్లో మల్టీకల్చర్ స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ. దాదాపు ఇందులో చదువుతున్న చాలామంది స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులతో మంచి స్నేహితులుగా మెలిగేందుకు కూడా ఈ రోజు ఉపయోగపడుతుంది.

ప్రాముఖ్యత

వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులు పరస్పరం ఆలోచనలను పంచుకునే వాతావరణంలో, ఆవిష్కరణ, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. రాబోవు తరాల పిల్లలు సమస్యల మీద పని చేయగల సత్తా, కొత్త పరిష్కారాలతో ముందుకు రాగల అభివృద్ధి చెందాలంటే, ప్రజల వైవిధ్యం గురించి తెలుసుకోవాలి, తేడాలను అంగీకరించడం నేర్చుకోవాలి. దానికి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని పాటించడం ముఖ్యం.

అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?

విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ఈ రోజున అకడమిక్ వర్క్‌షాప్‌లు, ఆహార రుచులు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇందులో భాగంగా ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్ అవకాశాలపై వివరాలను కూడా అందిస్తారు.

ఉపన్యాసాలు, వర్క్‌షాప్‌లు, కార్నివాల్‌లు, సాంస్కృతిక ఉత్సవాలు వంటి కార్యక్రమాలను అనేక పాఠశాలలు క్రమం తప్పకుండా నిర్వహిస్తాయి. దీనకి అనుగుణంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలు, పరీక్షలు, చర్చలు, ఇతర వినోదాత్మక కార్యకలాపాలు వంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం రోజున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు యువత ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

వివిధ దేశాలు, రాష్ట్రాల విద్యార్ధుల మధ్య స్నేహసంబంధాలు పెరగాలంటే ఏం చెయ్యాలి?

1. ఒకరినొకరు తెలుసుకోవాలి.

2. ఒకరి కల్చర్ మరొకరు తెలుసుకోవడం

3. ఒకరి భాష ఒకరు నేర్చుకోవడం

4. Multi cultural students groupతో గేమ్స్ నిర్వహించడం

5. activities, projects, tours చేయించడం

వంటి కార్యక్రమాలతో స్నేహసంబంధాలు, సంస్కృతులు కలుస్తాయి.

Updated Date - 2022-11-17T14:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising