ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త హత్యకు సుఫారీ.. తప్పించుకున్నాడని అన్నంలో విషం పెట్టి మరీ చంపేసిన భార్య.. కానీ వాట్సప్ చాటింగ్‌తో..

ABN, First Publish Date - 2022-12-09T18:13:48+05:30

వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధం మోజులో పడిన కాన్పూర్‌ మహిళ దారుణానికి తెగించింది. ముందు తన మామగారిని చంపేసింది. అనంతరం తన భర్తను హత్య చేసింది. కోట్ల రూపాయల ఆస్తి తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది. చివరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధం మోజులో పడిన కాన్పూర్‌ మహిళ దారుణానికి తెగించింది. ముందు తన మామగారిని చంపేసింది. అనంతరం తన భర్త హత్యకు సుఫారీ ఇచ్చింది. తప్పించుకోవడంతో విషం పెట్టి హత్య చేసింది. కోట్ల రూపాయల ఆస్తి తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. హత్యల అనంతరం ప్రియుడితో ఆమె చేసిన వాట్సాప్ ఛాటింగ్ పోలీసులకు పట్టించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

కాన్పూర్‌కు చెందిన రిషబ్ తివారీ అనే వ్యక్తి హత్య కేసు క్రైమ్ సినిమాను తలపిస్తోంది. శివాలీ రోడ్డులో నివాసం ఉంటున్న రిషబ్ తివారీ (29) రెండేళ్ల క్రితం సప్నా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత రాజు అనే యువకుడితో సప్నా వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచుగా అతడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. భర్త రిషబ్‌, మామగారిని చంపాలని ప్రేమికుడు రాజుతో కలిసి ప్లాన్ వేసింది. మొదటగా తన మామగారికి ఓవర్ డోస్ మందులు ఇచ్చి సునాయాసంగా చంపేసింది. అతడు వృద్ధాప్యం కారణంగా చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుపారీ ఇచ్చి భర్తను హతమార్చాలని చూసింది. అనుకున్నట్టుగానే ఇద్దరు వ్యక్తులకు రూ.3 లక్షలు ఇచ్చి భర్తపై దాడి చేయించింది. అయితే ఆ దాడిలో రిషబ్ తీవ్ర గాయాల పాలై హాస్పిటల్‌లో చేరాడు.

ఐదు రోజుల పాటు చికిత్స అందుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. గత నెల 27వ తేదీన రిషబ్‌కు సప్నా అన్నంలో విషం కలిపి పెట్టింది. అది తిని రిషబ్ మరణించాడు. పోస్ట్‌మార్టమ్‌లో సందేహాలు నెలకొనడంతో పోలీసులు రిషబ్‌ది హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లను గుర్తించారు. ఆ నెంబర్ నుంచి తరచుగా సప్నా మొబైల్‌కు కాల్స్ రావడం గమనించి విచారించగా.. ఆ నెంబర్ రాజుదని తేలింది. సప్నా, రాజుల చాటింగ్‌లను పరిశీలించగా.. రిషబ్‌ హత్యకు సంబంధించిన సంభాషణ బయటపడింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-12-09T18:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising