సడన్‌గా అన్న అదృశ్యం.. 4 రోజుల తర్వాత వదిన కూడా ఇంట్లోంచి మాయం.. ఆ చెల్లికి డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2022-12-31T15:35:57+05:30
ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఆరేళ్లుగా తన పొరుగింట్లో ఉండే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.. విషయం భర్తకు తెలియడంతో తరచుగా గొడవలు జరుగుతుండేవి.. భర్త కొడుతున్న సరే ఆమె తన వివాహేతర సంబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టలేదు.. చివరకు..
ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఆరేళ్లుగా తన పొరుగింట్లో ఉండే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.. విషయం భర్తకు తెలియడంతో తరచుగా గొడవలు జరుగుతుండేవి.. భర్త కొడుతున్న సరే ఆమె తన వివాహేతర సంబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టలేదు.. చివరకు ప్రియుడితో కలిసి భర్తను చంపేసి మృతదేహాన్ని పూడ్చి పెట్టింది.. నాలుగు రోజుల తర్వాత ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh Crime News) లఖింపూర్‌లో ఈ ఘటన జరిగింది.
లఖింపూర్‌కు సమీపంలోని ఝండి గామానికి చెందిన ఇంగ్లీష్ అనే వ్యక్తి భార్య జూలీకి సమీపంలోనే ఉంటున్న సంతోష్‌తో 6 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో వారిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. సంతోష్‌కు దూరంగా ఉండాలని భార్యను కొట్టేవాడు. దీంతో భర్తను అడ్డు తప్పించడానికి జూలీ సిద్ధపడింది. తన ప్రియుడితో కలిసి భర్తను గొడ్డలితో నరికి చంపింది (Wife Killed Husband). అనంతరం మృతదేహాన్ని పొలంలో గొయ్యి తీసి పూడ్చింది. చుట్టు పక్కల వారు అడిగితే పని కోసం వేరే ఊరు వెళ్లినట్టు చెప్పింది. నాలుగు రోజుల తర్వాత ఆమె సంతోష్‌తో కలిసి పరారైంది.
అన్న, వదిన ఒకరి తర్వాత ఒకరు మాయం కావడంతో ఇంగ్లీష్ సోదరికి అనుమానం వచ్చింది. శుక్రవారం ఉదయం ఇంగ్లీష్ సోదరుడు పొలానికి వెళ్లగా అక్కడ మృతుడి చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి తవ్వి చూడగా మృతదేహం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. జూలీని, ఆమె ప్రియుడు సంతోష్‌ను వెతికి పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - 2022-12-31T15:35:58+05:30 IST