ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం భారీ స్కెచ్.. ఏటీఎమ్‌ నుంచి రూ.20 లక్షలు ఎలా దోచుకున్నాడంటే.. చివరకు..

ABN, First Publish Date - 2022-11-30T19:07:46+05:30

ఆ యువకుడు ఆరు నెలల క్రితం బెంగళూరులోని ఏటీఎమ్ సెంటర్ దగ్గర గార్డుగా ఉద్యోగం సంపాదించాడు.. చాలా రోజులుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆ యువకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు.. పెళ్లికి బాగా డబ్బులు అవసరమవడంతో తన పని చేస్తున్న ఏటీఎమ్ సెంటర్ నుంచే కొట్టెయ్యాలని ఫిక్స్ అయ్యాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడు ఆరు నెలల క్రితం బెంగళూరులోని ఏటీఎమ్ సెంటర్ దగ్గర గార్డుగా ఉద్యోగం సంపాదించాడు.. చాలా రోజులుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆ యువకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు.. పెళ్లికి బాగా డబ్బులు అవసరమవడంతో తన పని చేస్తున్న ఏటీఎమ్ సెంటర్ నుంచే కొట్టెయ్యాలని ఫిక్స్ అయ్యాడు.. అద్భుతమైన స్కెచ్ వేసి దాదాపు రూ.20 లక్షలు కొట్టేశాడు.. సీసీటీవీ ఫుటేజ్‌కు కూడా దొరక్కుండా తప్పించుకున్నాడు.. అయితే అతను సక్రమంగా డ్యూటీకి రాకపోవడంతో బ్యాంకు అధికారులకు దొరికిపోయాడు.. చివరకు జైలు పాలయ్యాడు.

బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ దగ్గర గార్డుగా 23 ఏళ్ల దీపోంకర్ ఆరు నెలల క్రితం ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రూ.20 లక్షలు దోచుకున్నాడు. ఆ దోపిడీకి అతడు ఎంతో కాలం నుంచి స్కెచ్ వేస్తున్నాడు. ఏటీఎం సెంటర్‌లో డబ్బు లోడ్ చేసే సిబ్బందితో స్నేహం పెంచుకున్నాడు. వారి డైరీలో ఉన్న ఏటీఎమ్ క్యాసెట్ పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. చివరకు ఈ నెల 17వ తేదీ రాత్రి క్యాసెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న రూ.20 లక్షలు దోచుకున్నాడు. ఏటీఎమ్ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. డబ్బు దోచుకున్న తర్వాతి రోజు నుంచి డ్యూటీకి వెళ్లడం మానేశాడు.

దాంతో బ్యాంకు మేనేజర్‌కు డబ్బు దోచుకున్నది దీపోంకర్ అని అనుమానం వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు విషయం చెప్పాడు. పోలీసులు ఐదు రోజుల పాటు దీపోంకర్‌ను గాలించి పట్టుకున్నారు. విచారణలో దీపోంకర్ నిజం అంగీకరించాడు. తన ప్రేయసితో పెళ్లి గురించే డబ్బు దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. దోచుకున్న డబ్బులో రూ.5 లక్షలు పెట్టి స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టు చెప్పాడు. మిగిలిన రూ.15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీపోంకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-11-30T19:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising