ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ather 450 X: నెల్లూరు రోడ్లపై ఎథర్ 450X పరుగులు

ABN, First Publish Date - 2022-12-27T20:17:47+05:30

దేశంలోని ప్రముఖ విద్యుత్ స్కూటర్ తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ(Ather Energy) నుంచి వచ్చిన ‘ఎథర్ 450ఎక్స్’(Ather 450 X)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: దేశంలోని ప్రముఖ విద్యుత్ స్కూటర్ తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ(Ather Energy) నుంచి వచ్చిన ‘ఎథర్ 450ఎక్స్’(Ather 450 X) వాహనాలు ఇకపై నెల్లూరు(Nellore) రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ఈ సంస్థ నేడు (మంగళవారం) నెల్లూరులో ఆర్కెడ్‌ ఆటో భాగస్వామ్యంతో నూతన రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఎథర్ ఎనర్జీకి ఏపీలో ఇది నాలుగో అవుట్‌లెట్. మొదటి మూడు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలలో ఉన్నాయి. కాగా, ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని సందర్శించడానికి ముందే ఎథర్‌ ఎనర్జీ వెబ్‌సైట్‌ ద్వారా టెస్ట్ రైడ్ కోసం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.

నూతన అవుట్‌లెట్ ప్రారంభం సందర్భంగా ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ ఫొకేలా మాట్లాడుతూ.. ఈవీ(EV)లకు ఏపీలో అసాధారణ డిమాండ్ ఉన్నట్టు పేర్కొన్నారు. నెల్లూరు ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ఈ డిమాండ్‌ను తీరుస్తుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఎథర్‌ను విస్తరించనున్నట్టు చెప్పారు.

ఆర్కేడ్ ఆటో ప్రైవేట్ లిమిడెట్ డైరెక్టర్ శ్రీతేజ్ మాట్లాడుతూ.. ఎథర్ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సాంకేతికంగా అత్యాధునికమైన, అత్యున్నత పనితీరు కనబరిచే స్కూటర్లతో భారతీయ వాహన విద్యుత్ రంగాన్ని గణనీయంగా మారుస్తుందన్నారు. సంప్రదాయ స్కూటర్ల నిర్వహణ ఖర్చు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో నెల్లూరు వినియోగదారులు ఈవీలకు మారాలనుకుంటున్నట్టు చెప్పారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి నెల్లూరులో 6 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు, ఎథర్ గ్రిడ్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు మరో 8-10 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడాన్ని ఎథర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా 50కి పైగా ఎథర్‌ గ్రిడ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాలలో 76 ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను,750కి పైగా ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్లను ఎథర్ ఏర్పాటు చేసింది. నవంబరులో దేశంలో 7234 యూనిట్లను ఎథర్‌ డెలివరీ చేసింది.

ఎథర్ 450 X వాహన ధర ఫేమ్‌-2 రివిజన్‌ తరువాత (ఎక్స్‌ షోరూమ్‌ ) 1,55,605 రూపాయలు కాగా, ఎథర్‌ 450 ప్లస్‌ ధర రూ.1,34,095. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీలతో భాగస్వామ్యం చేసుకుని అతి సులభమైన ఫైనాన్సింగ్‌ అవకాశాలను వినియోగదారులకు అందిస్తోంది.

Updated Date - 2022-12-27T20:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising