రెడ్డి గణపవరం గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’
ABN, First Publish Date - 2022-12-08T15:33:45+05:30
వైసీపీ ప్రభుత్వ తీరును జనంలో ఎండగట్టే ప్రధాన లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.
జగ్గారెడ్డిగూడెం/ ఏలూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వ తీరును జనంలో ఎండగట్టే ప్రధాన లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో బుట్టాయగూడెం మండలం, రెడ్డి గణపవరం (Reddy Ganapavaram) గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నేరుగా ప్రజలతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. తమ పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మడకం రామకృష్ణ, యూనిట్ ఇంచార్జి పుసులూరి అచ్యుతరావు, నాయకులు గన్నిన సూర్యచంద్రరావు, పసుమర్తి భీమేశ్వరరావు, తూంపాటి దుర్గారావు, పుసులూరి శ్రీను, పుసలూరి సర్వారాయుడు, తూంపాటి చిన్న సుబ్బారావు, గద్దె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-08T15:41:37+05:30 IST