ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vishnukumar Raju: జగన్‌ను ఎన్నుకోవడం ప్రజల దురదృష్టం

ABN, First Publish Date - 2022-12-15T12:38:13+05:30

జగన్‌ను ఎన్నుకోవడం ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జగన్‌ను ఎన్నుకోవడం ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (BJP Leader Vishnukumar Raju) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ (AP CM Jagan Mohan Reddy)... అప్పుల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశారు. నల్లధనంలో ఏపీ నెంబర్ వన్ చేసిన ఘనత వైసీపీ నేతలదే అని విమర్శించారు. ఋషికొండ విధ్వంసం చేశారని... బోడి గుండు కొట్టించారన్నారు. ఈ కారణంతో హుద్ హుద్ తుపానులు లాంటివి వస్తే విశాఖ ప్రమాదంలోకి వెళుతుందని ఆయన తెలిపారు.

బుగ్గన (AP Finance Minister Buggana Rajendranath Reddy) ఆర్థిక మంత్రి కాదు... అప్పుల మంత్రి అని అన్నారు. అప్పులు తేవడంలో ఆర్ధిక మంత్రి బుగ్గన దిట్ట అని ఆయనకు కృతజ్ఞతలు అంటూ యెద్దేవా చేశారు. హత్య చేసిన వ్యక్తికి ర్యాలీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ... తక్షణమే ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం వైసీపీ అరాచకాలకు నిదర్శనమన్నారు. జగనన్న సంబరాలు ఇక ఒక ఏడాదిన్నర వరకే ఉంటాయని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-15T12:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising