Chandrababu: దళిత నేత చేత ఎమ్మెల్యే కాళ్లు పట్డిస్తారా?..
ABN, First Publish Date - 2022-12-31T14:23:50+05:30
నెల్లూరు (Nellore): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను దళిత బాధిత హర్ష కుటుంబ సభ్యులు కలిశారు.
నెల్లూరు (Nellore): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను దళిత బాధిత హర్ష కుటుంబ సభ్యులు కలిశారు. కావలి ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తాళలేక హర్ష ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హర్షని బతకినివ్వరంటూ కుటుంబ సభ్యులు చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే కాళ్లు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మా
ట్లాడుతూ..
దళిత నేత చేత ఎమ్మెల్యే కాళ్లు పట్డిస్తారా?.. ఖబడ్దార్ ఎమ్మెల్యే.. పోలీసులూ ఏమనుకుంటున్నారు. సైకోల ఆనందం కోసం చిత్రహింసలు పెడతారా? అంటూ హెచ్చరించారు. హర్ష కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, వారి పిల్లలను తామే చదివిస్తామని స్పష్టం చేశారు. హర్ష కుటుంబం జోలికివస్తే సహించమని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు.
Updated Date - 2022-12-31T14:23:52+05:30 IST