ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhiram: కుతంత్రంతోనే జగన్ రెడ్డి అమూల్ జపం

ABN, First Publish Date - 2022-12-15T13:12:10+05:30

సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సైకో స్టార్ జగన్ రెడ్డి రాష్ట్రంలో సహకార డెయిరీల

కుతంత్రంతోనే జగన్ రెడ్డి అమూల్ జపం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సైకో స్టార్ జగన్ రెడ్డి రాష్ట్రంలో సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేయడానికి సరికొత్తగా ‘అమూల్ బేబీ’ అవతారం ఎత్తారు అంటూ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాడి పరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కుతంత్రంతోనే జగన్ రెడ్డి అమూల్ జపం చేస్తున్నారు. అడ్డగోలుగా చిత్తూరు డెయిరీ (Chittoor Dairy) ఆస్తుల్ని నామమాత్రంగా ఏడాదికి రూ.కోటి చొప్పున 99 ఏళ్లకు అమూల్‌కు లీజుకిచ్చారు. ఏడాదిలో అధికారం కోల్పోయి చంచల్‌గూడ జైల్లోఉండే జగన్ రెడ్డికి రూ.650 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని 99 ఏళ్ల పాటు లీజుకిచ్చే హక్కు ఎక్కడిది? సంవత్సరానికి రూ.కోటి చొప్పున ఒకే ఫ్లాట్ రేట్‌తో 99 ఏళ్ల పాటు చిత్తూరు డెయిరీని జగన్ రెడ్డి అమూల్ సంస్థ (Amul company)కు కట్టబెట్టారు. 2022లో కోటి రూపాయల లీజు... మరో వందేళ్ల తర్వాత కూడా కోటి రూపాయలేనా? సహకార రంగంలోని ప్రధాన డెయిరీని కమీషన్ల కోసం అమూల్ సంస్థకు కట్టబెడతావా జగన్ రెడ్డి? ఎన్నికలకు ముందు లీటర్ పాలకు రూ.4లు బోనస్(Bonus) ఇస్తానన్న హామీ ఏమైది జగన్ రెడ్డి? కృష్ణా మిల్క్ యూనియన్ (Krishna Milk Union) ఏడాదికి రూ.60 కోట్ల బోనస్ ఇస్తుంటే.. సంగం డెయిరీ(Sangam Dairy) కొన్నికోట్ల రూపాయల బోనస్ పాడి రైతులకు చెల్లిస్తుంటే.. అమూల్ పైసా ఇవ్వడం లేదు.’’ అని పట్టాభి ఆరోపించారు.

‘‘బోనస్‌లే కాకుండా రాష్ట్రంలోని సహకార డెయిరీలు కళ్యాణమస్తు, క్షీరబంధు వంటి పథకాలు పాడి రైతులకు అమలు చేస్తున్నాయి. సబ్సిడీపై పశుగ్రాసం, దాణా అందిస్తున్నాయి. అమూల్ సంస్థ ఎంతమంది రైతులకు, ఎన్నిలీటర్లకు రూ.4 బోనస్ ఇచ్చిందో.. పాడి రైతులకు ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో ‘అమూల్ బేబీ’ చెప్పాలి. అమూల్ సంస్థకు ఉపయోగపడే బీఎంసీయూల ఏర్పాటుకు రూ.979కోట్లు, ఏఎంసీయూలు ఏర్పాటుకు రూ.1700 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం ఏమిటి? విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 45 విలువైన స్థలాలను, విశాఖపట్నంలో 103 ప్రదేశాల్లోని విలువైన స్థలాల్ని అవుట్ లెట్ల ఏర్పాటు కోసం అమూల్‌కు అప్పగించారు. అమూల్ సంస్థ వల్ల ఏపీలోని పాడి రైతులకు ఇసుమంత మేలు కలగనప్పుడు వేలకోట్ల ఆస్తుల్ని ఎందుకు కట్టబెడుతున్నావు జగన్ రెడ్డి? జగన్ రెడ్డి అమూల్ సంస్థ కోసం పాలు సేకరించే పనిని ఏకంగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. పాలసేకరణ, ప్రాసెసింగ్ ప్రభుత్వమే భరించడం వల్ల అమూల్‌కు లీటర్‌కు రూ.10ల చొప్పున, ఏడాదికి రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్ల లాభం. పాలదొంగ మంత్రి అప్పలరాజు, అమూల్ బేబీ కలిసి పాడి రైతుల్ని దోపిడీ చేసే అమూల్ కోసం పని చేస్తారా? అమూల్ సంస్థ ఇచ్చే కమీషన్ల కోసం జగన్ రెడ్డి ఇంతలా కక్కుర్తిపడాలా?’’ అంటూ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T13:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising