ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalva srinivasulu: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది

ABN, First Publish Date - 2022-11-05T11:47:46+05:30

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాధరణను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)కు వస్తున్న ప్రజాధరణను వైసీపీ (YCP) జీర్ణించుకోలేకపోతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalva srinivasulu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అందుకే సీఎం జగన్ (YS Jagan mohan reddy) ఆయన్ను దొంగ దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నందిగామలో కరెంటు తీసేసి రాళ్లు వేయించడాన్ని బట్టి చూస్తే జగన్ (AP CM) ఎంతగా భయపడుతున్నాడో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. దీని ద్వారా తన పాలనలో శాంతి, భద్రతల వైఫల్యాన్ని జగనే చాటుకున్నట్లయిందన్నారు. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్ష నాయకుడిని భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతమని తెలిపారు. పాలకులు ఇలాంటి 'పిచ్చి'పనులు మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాలవ శ్రీనివాసులు (Former minister) హెచ్చరించారు.

Updated Date - 2022-11-05T11:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising