ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kapu Leaders: బెజవాడలో కాపునేతల భేటీ... క్యాజువల్‌గానే అంటున్న నేతలు

ABN, First Publish Date - 2022-12-15T11:30:58+05:30

బెజవాడలో కాపునేతల భేటీ ఆసక్తి రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బెజవాడలో కాపునేతల భేటీ ఆసక్తి రేపుతోంది. మాజీమంత్రి గంటా శ్రీనివాస్ (Ganta Srinivas) నివాసంలో కన్నా లక్ష్మినారాయణ (Kanna Laxminarayana), బొండా ఉమ(Bonda Uma), యడం బాలాజీ (Yadam Balaji) సమావేశం అయ్యారు. వంగవీటి రంగా వర్ధంతి, ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే బాగుంటుందని నేతలు భావించారు. కన్నాతో నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) భేటీపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో పరిస్ధితులు, ఇతర అంశాలపై చర్చించామని కన్నా చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీ (PM Narendra Modi)తో పవన్ (Janasena Chief Pawan Kalyan) భేటీపై కూడా సమావేశంలో చర్చించారు. ఆరుసంవత్సరాలు తరువాత పవన్‌కు మోదీ పిలుపుపై కూడా సమావేశంలో నేతలు చర్చించారు. రాష్ట్రంలో కాపుల పరిస్ధితిపై సమావేశంలో చర్చించి సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా... వివాహానికి హజరై అక్కడ కలుసుకొని అందరం గంటా ఇంటికి వచ్చామని నేతలు చెపుతున్నారు. క్యాజువల్‌గా కలిశామని బొండా ఉమ, కన్నా లక్ష్మినారాయణ ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) తెలిపారు.

Updated Date - 2022-12-15T11:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising