ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP High Court: జనసేన నేతపై డిప్యూటీ సీఎం కుమార్తె పెట్టిన కేసుపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-11-17T14:06:59+05:30

అమరావతి (Amaravathi): పదిరికుప్పం జనసేన నాయకుడు పొన్నా యుగంధర్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కే.కృపాలక్ష్మి పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): పదిరికుప్పం జనసేన నాయకుడు పొన్నా యుగంధర్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కే.కృపాలక్ష్మి పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తన తండ్రి, తనపై అసత్య ప్రచారాలతో వేధిస్తున్నారంటూ తమ నిజాయితీని ప్రజల్లో చులకన చేస్తున్నారంటూ కారేటినగర్ పోలీస్ స్టేషన్‌లో కృపాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద యుగంధర్‌పై కేసు నమోదు చేశారు. కేవలం అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న నెపంతో మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. తన తండ్రిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నారాయణస్వామి కుమార్తె రిపోర్టు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమని అన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ రఘునందన్ రావు ధర్మసనం కేసుపై పూర్తిస్థాయి స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రైమ్‌కు సంబంధించి మొబైల్ ఫోన్, తదితర మెటీరియల్ పోలీసులు ముందు ఉంచాలని పేర్కొంటూ.. సెక్షన్ 91 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులు కూడా న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ.. తదుపరి విచారణ జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-17T14:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising