ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravati farmers: ఢిల్లీ బయలుదేరిన అమరావతి రాజధాని రైతులు

ABN, First Publish Date - 2022-12-15T21:06:07+05:30

అమరావతి (Amaravati) రాజధాని రైతులు ప్రత్యేక రైలులో గురువారం ఢిల్లీకి బయలు దేరారు. రాజధాని 29 గ్రామాలకు చెందిన 1800 మంది రైతులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు: అమరావతి (Amaravati) రాజధాని రైతులు ప్రత్యేక రైలులో గురువారం ఢిల్లీకి బయలు దేరారు. రాజధాని 29 గ్రామాలకు చెందిన 1800 మంది రైతులు, మహిళలు ఢిల్లీలో అమరావతి గళం వినిపించడానికి తరలారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ (Vijayawada Railway Station)లో మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రైన్‌ ఎక్కారు. ‘జై అమరావతి’ అంటూ విజయవాడ నుంచే నినాదాలు ప్రారంభించారు. పూర్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని ధరకోటగా ఉండేది. ఈ ఢిల్లీ కార్యక్రమాన్ని ‘ధరణికోట టూ ఎర్రకోట’ గా దీనిని రైతు జేఏసీ పేర్కొంది. శుక్రవారం రాత్రి పది గంటలకు రైతులు, మహిళలు ఢిల్లీ చేరుకుంటారు. శని, ఆదివారాలలో అనగా 17, 18 తేదీలలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. అమరావతిని కాపాడాలని, మూడు ముక్కలాటతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఢిల్లీలో వినిపిస్తారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసిందో బీజేపీ ప్రజా ప్రతినిధులను కలిసి రైతులు విన్నవిస్తారు. అన్ని పార్టీల నేతలను కలసి తమకు సంఘీభావం తెలపాలని కోరతారు. చట్ట ప్రకారం రాజధానికి భూములిస్తే ఆ చట్టాలను కాదని సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని మొండిగా వ్యవహరించడం గురించి ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని రైతు జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు తదితర జేఏసీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T21:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising