ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News.. ఉమ్మడి పౌరసత్వ బిల్లును సీపీఐ వ్యతిరేకిస్తోంది: నారాయణ

ABN, First Publish Date - 2022-12-10T12:20:29+05:30

తిరుపతి: కడప ఉక్కు ఫ్యాక్టరీ (Kadapa Steel Factory) కోసం సీపీఐ (CPI) పాదయాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కడప ఉక్కు ఫ్యాక్టరీ (Kadapa Steel Factory) కోసం సీపీఐ (CPI) పాదయాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్షం కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు చెప్పారు. రాజకీయాలపై పోరాటం చేయగలం కానీ ప్రకృతిపై చేయలేమన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరులో బీజేపీ (BJP), వైసీపీ (YCP) మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. త్వరలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఛలో రాయలసీమ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లును సీపీఐ వ్యతిరేకిస్తోందన్నారు.

ఉమ్మడి పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే దేశం ఒక్కటిగా ఉండదని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లుపై సిఎం జగన్ తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై సిఎం జగన్ పెదవి విప్పాలన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేక శక్తులతో బీఆర్ఎస్ కలుస్తుందా? లేదా? అనే దానిపై తమ వైఖరి ఉంటుందన్నారు. ఈ నెల 29న సీపీఐ జాతీయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, దీనిపై 29న దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు పుదిచ్ఛేరిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై కార్యవర్గంలో చర్చిస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఓటమికి బీజేపీ అధ్యక్షుడిపై కాకుండా నరేంద్రమోదీపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలని నారాయణ అన్నారు.

Updated Date - 2022-12-10T12:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising