ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీర కట్టుకుని రావద్దన్న రెస్టారెంట్ మూతపడనుంది

ABN, First Publish Date - 2021-09-30T01:06:12+05:30

అక్విలా రెస్టారెంట్‌ను హెల్త్ ఇన్స్‌పెక్టర్ పలుమార్లు తనిఖీ చేశారు. కానీ హెల్త్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా కొనసాగిస్తున్నారు. రెస్టారెంట్ యాజమాన్యానికి 48 గంటల సమయం ఇచ్చాం. అయినా స్పందించలేదు. మరో నోటీసు వస్తే, ఇక రెస్టారెంట్ మూసివేయడమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చీర కట్టుకుని రావద్దని చెప్పిన రెస్టారెంట్ మూత పడనుంది. పోయిన వారం ఓ మహిళ తాను చీర కట్టుకున్నానని రెస్టారెంట్‌లోకి రానివ్వలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో సదరు రెస్టారెంట్‌పై తీవ్ర ప్రభావం పడింది. తాము అలా చేయలేదని, వాస్తవానికి సదరు మహిళనే తమ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించారని, ఒకరిని కొట్టారని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే మహిళ చేసిన ఆరోపణలు రెస్టారెంట్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.


దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) అధికారులు అక్విలా అనే రెస్టారెంట్‌కు నోటీసులు పంపారు. హెల్త్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా రెస్టారెంట్ కొనసాగిస్తున్నారని, మూసివేయక తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్‌డీఎంసీ ఒకరు మాట్లాడుతూ ‘‘అక్విలా రెస్టారెంట్‌ను హెల్త్ ఇన్స్‌పెక్టర్ పలుమార్లు తనిఖీ చేశారు. కానీ హెల్త్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా కొనసాగిస్తున్నారు. రెస్టారెంట్ యాజమాన్యానికి 48 గంటల సమయం ఇచ్చాం. అయినా స్పందించలేదు. మరో నోటీసు వస్తే, ఇక రెస్టారెంట్ మూసివేయడమే’’ అని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: 

చీర కట్టుకుందని అనుమతి ఇవ్వలేదు: ఢిల్లీలో ఘటన

Updated Date - 2021-09-30T01:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising