ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: టీటీడీ నిధుల మళ్లింపునకు బ్రేక్

ABN, First Publish Date - 2020-10-18T03:35:54+05:30

తిరుమల వెంకన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టాలని నిర్ణయించిన టీటీడీ.. ఆంధ్రజ్యోతి‌లో ప్రచురితమైన ‘గోవిందా.. గో..విందా!’ కథనం ఎఫెక్ట్‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుమల వెంకన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రజ్యోతి‌లో ప్రచురితమైన ‘గోవిందా.. గో..విందా!’ కథనం ఎఫెక్ట్‌తో టీటీడీ బోర్డ్ యూ-టర్న్ తీసుకుంది. ఈ నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. బాండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిధుల మళ్లింపునకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో బ్రేక్ పడింది. ఇకపై.. బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి... అబ్బాయ్‌ వైఎస్‌ జగన్‌ సర్కారు సేవలో తరించేందుకు రంగం సిద్ధం చేసిన నిర్ణయంపై శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితమైంది.


టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను ‘వడ్డీ కోసం’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. దినదిన గండం అన్నట్లుగా ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ బండిలాగుతున్న సర్కారు వారికి తమదైన ‘సాయం’ చేయాలని తీర్మానించిన విషయాన్ని వివరించింది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే దీనిపై తీర్మానం చేసిన విషయాన్ని బయటపెట్టింది. డిసెంబరులో ఈ ప్రణాళికను అమలు చేయడమే తరువాయి అని, ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారని కథనంలో ఆంధ్రజ్యోతి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అత్యంత రహస్యంగా ఉంచిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టడంతో ఈ నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం చదివేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.


అబ్బాయ్‌ సేవలో బాబాయ్‌... వెంకన్న సొమ్ము జగనన్న సర్కార్‌కు


Updated Date - 2020-10-18T03:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising