Viral Video: టీవీ సీరియళ్లా.. మజాకా.. ఈ సీన్ చూసి నవ్వాపుకోగలిగితే గ్రేటే.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2022-05-13T21:56:33+05:30 IST

సుదీర్ఘంగా సాగే టీవీ సీరియళ్లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటాయి. లాజిక్ లేకుండా సాగే సీన్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి.

Viral Video: టీవీ సీరియళ్లా.. మజాకా.. ఈ సీన్ చూసి నవ్వాపుకోగలిగితే గ్రేటే.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

సుదీర్ఘంగా సాగే టీవీ సీరియళ్లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటాయి. లాజిక్ లేకుండా సాగే సీన్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. అయినా ఎంతో మంది మహిళా ప్రేక్షకులు సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతుంటారు. అన్ని భాషల్లోనూ టీవీ సీరియళ్లపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా `స్వర్ణ ఘర్` అనే హిందీ సీరియల్ తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. 


నిజానికి `స్వర్ణ ఘర్` టీవీ సీరియల్ కథ చాలా మందికి నచ్చింది. మంచి టీఆర్పీలు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఆ సీరియల్‌లో తాజాగా ప్రసారమైన ఓ సన్నివేశం నవ్వుల పాలైంది. ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తున్న సంగీతా ఘోష్ చున్నీ ఓ టేబుల్ ఫ్యాన్‌ లోపలికి వెళ్లిపోయి రెక్కలకు చుట్టుకుపోతుంది. మెడ చుట్టూ చున్నీ బిగుసుకుపోవడంతో సంగీతకు ఊపిరి ఆడదు. ఆ గదిలో ఉన్న వారంత టెన్షన్ పడుతూ.. `రక్షించండి.. రక్షించండి` అని అరుస్తారు తప్ప ఎవరూ ఫ్యాన్ స్విచ్ కూడా ఆపరు. 


పాపం.. స్నేహితులు ముగ్గురూ పోలీసులు కావాలనుకున్నారు.. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా..!



దాదాపు రెండు నిమిషాలు పాటు సాగే ఆ సీన్‌ను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసి `నవ్వలేక పోయాను` అని కామెంట్ చేశాడు. ఆ ట్వీట్‌ను ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ షేర్ చేసి `ది సస్పెన్స్` అని కామెంట్ చేశాడు. ఇప్పటికే 15 లక్షల మంది ఆ వీడియోను చూసి తమదైన శైలలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 



Read more