పాపం.. స్నేహితులు ముగ్గురూ పోలీసులు కావాలనుకున్నారు.. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా..!

ABN , First Publish Date - 2022-05-13T20:41:28+05:30 IST

ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాలన్నది వారి కల..

పాపం.. స్నేహితులు ముగ్గురూ పోలీసులు కావాలనుకున్నారు.. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా..!

ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాలన్నది వారి కల.. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పడడంతో పరీక్షకు బాగా సన్నద్ధమయ్యారు.. వేరే ఊరిలో ఉన్న ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.. రైలు రావడంతో ప్లాట్‌‌ఫామ్ మీద నుంచి కాకుండా అవతలి వైపు పట్టాల మీద నుంచి ఎక్కేందుకు ప్రయత్నించారు.. అయితే అదే సమయంలో ఆ పట్టాలపైకి వచ్చిన నాన్ స్టాప్ సూపర్ స్పీడ్ రైలు ఆ ముగ్గురినీ ఢీ కొట్టింది.. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 


రాజస్థాన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాసేందుకు బయటకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు రైలు ఢీకొని మృతి చెందారు. అల్వార్‌లోని రాజ్‌గఢ్ స్టేషన్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాసేందుకు మదన్, బబ్లూ యాదవ్, విక్రమ్ అనే ముగ్గురు యువకులు రాజ్‌గఢ్ నుంచి జైపూర్ వెళ్లే రైలు కోసం స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో ఆ రైలు ఎక్కేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో.. ఆ ముగ్గురూ ప్లాట్‌ఫామ్ నుంచి కాకుండా అవతలి వైపు పట్టాలపై నుంచి రైలు ఎక్కాలనుకున్నారు. 


అదే సమయంలో ఆ పట్టాలపై అల్వార్ వైపు నుంచి డబుల్ డెక్కర్ రైలు వస్తోంది. ఆ రైలుకు రాజ్‌గఢ్‌లో స్టాప్ లేదు. దీంతో ఆ రైలు వేగంగా దూసుకువచ్చింది. ఆ రైలును చూసిన ఇతర ప్రయాణికులు ఈ ముగ్గురినీ రక్షించేందుకు గట్టిగా కేకలు వేశారు. కానీ ముగ్గురి చెవుల్లో ఇయర్‌ఫోన్‌లు ఉన్నాయి. దాంతో ఆ ముగ్గురికి కేకలు వినబడలేదు. వేగంగా వచ్చిన ఆ రైలు ఢీకొనడంతో ముగ్గురి శరీరాలు తునాతునకలు అయిపోయాయ. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

Read more