ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వినియోగం పరిమితం!

ABN, First Publish Date - 2020-06-12T08:36:08+05:30

రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఇమ్యునోమోడ్యులేటర్‌ వంటి యాంటీ వైరల్‌ ఔషధాల వినియోగాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులకు మా త్రమే పరిమితం చేసే అవకాశం ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తీవ్ర అనారోగ్య కరోనా రోగులకు మాత్రమే 


న్యూఢిల్లీ, జూన్‌ 11: రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఇమ్యునోమోడ్యులేటర్‌ వంటి యాంటీ వైరల్‌ ఔషధాల వినియోగాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులకు మా త్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. కరోనా చికిత్స కోసం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను సమీక్షించ డం కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆదివారం స మావేశమైంది. త్వరలోనే సవరించిన మార్గదర్శకాలు వెల్లడికావచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నూతన మార్గదర్శకాల్లో.. రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఇమ్యునోమోడ్యులేటర్‌ వంటి యాంటీ వైరల్‌ ఔషధాల వాడకాన్ని పరిమితం చేయొచ్చు.  కరోనా చికిత్స కోసం ప్రస్తుతం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కొనసాగించి అజిథ్రోమైసిన్‌ను తొలగించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే టోసిలిజుమా బ్‌, ఇమ్యునోమోడ్యులేటర్‌ ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. వీటి ఫలితాల ఆధారంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కలిపి  మరికొన్ని ఔషధాల ను వాడే విషయాన్ని పరిశీలిస్తారు.  అత్యవసర పరిమిత వినియోగం కింద అమెరికాకు చెందిన గిలియద్‌ సైన్సె్‌సకు దేశంలో రెమ్‌డెసివిర్‌ మార్కెటింగ్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. హెటిరో, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సె స్‌, సిప్లా, మైలాన్‌ఎన్వి వంటి స్వదేశీ సంస్థలు గిలియద్‌ సహకారంతో  రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ విషయంలో కేంద్ర ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 


Updated Date - 2020-06-12T08:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising