బాలసాహిత్యంలో అక్షర విప్లవాలు: జూలూరు
ABN, First Publish Date - 2022-05-01T10:07:16+05:30
తెలుగు బాలసాహిత్యంలో అక్షర విప్లవాలకు తెలంగాణ నేల భూమికగా నిలవడం గర్వించదగిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
‘చంద్రకిరణాలు’ బాలగేయ పుస్తకం ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తెలుగు బాలసాహిత్యంలో అక్షర విప్లవాలకు తెలంగాణ నేల భూమికగా నిలవడం గర్వించదగిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శనివారం రవీంద్ర భారతి ప్రాంగణంలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో గద్వాల కిరణ్కుమారి రాసిన ‘చంద్రకిరణాలు’ బాలగేయాల పుస్తకాన్ని గౌరీశంకర్ ఆవిష్కరించారు. పిల్లల్లో సృజనను తట్టి లేపేందుకు బాలసాహిత్యం ఎంతో దోహదం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా బాలలే బాలసాహిత్యాన్ని రాయడం పెనుమార్పుగా అభివర్ణించారు. కఽథారచయిత్రి, గజల్ గాయని, కవయిత్రి అయిన గద్వాల కిరణ్కుమారి తన పుస్తకంలో బాలగేయాలను పిల్లల హృదయాలకు హత్తుకునేలా రాశారని జూలూరు వివరించారు. ఒకనాటి చందమామ బాలల పత్రికలో వచ్చిన కఽథలు ఆ తరంలో ఎంతో ప్రభావం చూపాయని కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ తెలిపారు. ప్రకృతి అందాలను గేయాల్లో హృద్యంగా వర్ణించారని ప్రముఖ రచయిత్రి కొల్లాపురం విమల పేర్కొన్నారు.
Updated Date - 2022-05-01T10:07:16+05:30 IST