పవన్ హెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు నో పర్మిషన్
ABN, Publish Date - Feb 14 , 2024 | 09:41 AM
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో బుధవారం నియోజకవర్గం ఇన్చార్జులు, ముఖ్యనాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకుతగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో బుధవారం నియోజకవర్గం ఇన్చార్జులు, ముఖ్యనాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకుతగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని హెలీపేడ్ వద్ద దిగేందుకు కాలేజీ యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ అనువుగా ఉండదంటూ ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కల్యాణ్ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 14 , 2024 | 11:33 AM