చంద్రబాబు వాయిస్‌తో వస్తున్న కాల్స్‌పై అలజడి
ABN, Publish Date - Mar 07 , 2024 | 11:26 AM
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పక్షాలు నిర్వహించే ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేకు సంబంధించి పార్టీలోని ప్రత్యర్థులు, నేతలపై నిఘా పెడుతున్నారు.
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పక్షాలు నిర్వహించే ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేకు సంబంధించి పార్టీలోని ప్రత్యర్థులు, నేతలపై నిఘా పెడుతున్నారు. ఈ కాల్స్‌ను అభిప్రాయ సేకరణ కోసం పార్టీలు ఉపయోగిస్తుంటే.. అభ్యర్థులు మాత్రం నియోజకవర్గంలో సొంత పార్టీలో వ్యతిరేకులు ఎవరున్నారో తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎవరు తమకు వ్యతిరేకంగా ఉన్నారో పసిగడుతున్నారని అధికారపార్టీలో అలజడి ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుణగణాలు, వారి అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ కోసం పార్టీలో కార్యకర్తలు, నేతలు ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేను తెప్పించుకుంటున్నారు. ఈ సర్వే ప్రస్తుతం రాష్ట్రంలోని పలునియోజక వర్గాల్లో జరుగుతోంది. అభ్యర్థిని మీరు సమర్ధిస్తారా? లేక నోటాకు ఓటు వేస్తారా? అని నేరుగా చంద్రబాబు వాయిస్‌తో వస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్‌పై టీడీపీలో అలజడి రేగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 11:26 AM