అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి: దస్తగిరి..
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:53 AM
కడప: వైసీపీ ఎంపీ, సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జైల్లో ఉండగా తనకు డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారని కోర్టుకు విన్నవించాడు.
కడప: వైసీపీ ఎంపీ, సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జైల్లో ఉండగా తనకు డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారని కోర్టుకు విన్నవించాడు. దస్తగిరి తరుఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఖండిషన్స్ అవినాష్ రెడ్డి అతిక్రమించారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 11 , 2024 | 11:53 AM