ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎంతో వరంగల్‌ మేయర్‌ భేటీ

ABN, Publish Date - Mar 04 , 2024 | 04:28 AM

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) కుడా హస్తగతం కానుంది. ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు.

గుండు సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ప్రచారం

కాంగ్రెస్‌లోకి 15 మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు!

సీఎం రేవంత్‌ రెడ్డితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ

కాంగ్రెస్‌లోకి వర్ధన్నపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

వరంగల్‌/హైదరాబాద్‌/భద్రాచలం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) కుడా హస్తగతం కానుంది. ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. తాజాగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు నేతృత్వంలో 15 మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పార్టీ మారాలని చూస్తున్న నగర మేయర్‌ గుండు సుధారాణి సైతం ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. తాను అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు సుధారాణి చెబుతున్నప్పటికీ.. ఆమె కూడా హస్తం గూటికి వెళ్తారని తెలుస్తోంది. అయితే మేయర్‌ చేరికను మంత్రితో పాటు కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండుమూడు రోజుల్లో మేయర్‌తో పాటు.. 18 నుంచి 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరనున్నారు. అలాగే డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు సైతం ఇటీవల సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డిని కలిశారు. పార్లమెంట్‌ ఎన్నికల లోపు రవీందర్‌రావు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. వర్ధన్నపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంగోతు అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్‌, మంచాల రామకృష్ణ, స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు పలువురు.. ఆదివారం ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మొత్తానికి బీఆర్‌ఎ్‌సకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కీలక నేతలు పార్టీలు మారుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

భద్రాచలం అభివృద్ధి కోసమే కలిశా: తెల్లం

భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. ఆదివారం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో భేటీ అయి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాచ లం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందించారు. సీఎంను కలిసిన అనంతరం.. వెంకట్రావు మీడియాతో మాట్లా డుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

కాంగ్రె్‌సలోకి బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శ్రుతి!

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆమె దివంగత నేత, బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు టికెట్‌ను ఆమె ఆశించారు. అయి తే బీజేపీ అధిష్ఠానం.. మరో అభ్యర్థి పేరును ప్రకటించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న శ్రుతి.. కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 04 , 2024 | 04:28 AM

Advertising
Advertising