ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:26 AM

: ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వా లని సీపీఎం మండల కార్యదర్శి వినోద్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.

చిట్యాలలో ఎండిన పొలాలు పరిశీలిస్తున్న నాయకులు

దామరచర్ల, మార్చి 3: ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వా లని సీపీఎం మండల కార్యదర్శి వినోద్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని నర్సాపురం, శాంతినగర్‌, తిమ్మాపురం, కల్లేపల్లి గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం పరిశీలించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాల అడుగంటి నీరందక పంటలు ఎండిపోవడంతో రైతులు రైతులు పెట్టిన పెట్టుబడులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలోని ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాల న్నారు. కార్యక్రమంలో నాయకులు పాపానాయక్‌, దయానంద్‌, ఎర్రనాయక్‌, కోటిరెడ్డి, బాలు, విజయ్‌, కామ్లా, పాండు పాల్గొన్నారు.

చిట్యాలరూరల్‌: భూగర్భజలాలు అడుగంటడడంతో వరి పంట పొలాలకు నీరందక ఎండిన వరిచేలను పశువుల మేతకు వేయ డమేనా అని రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం, ఐత రాజు నర్సింహ ప్రశ్నించారు. ఆరెగూడెంలో ఎండిన వరిపొలాలను ఆదివారం సీపీఎం, రైతుసంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. భూగర్భ జలాలు అడుగండడంతో వేసవి ఆరంభంలోనే పంటపొలాలు ఎండుతున్నాయన్నారు. సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం మిన్నుకుండపోవడం దారుణమన్నారు. వ్యవసాయానికి సాగునీటిందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని గ్రామాలకు పంపించి పంటల పరిస్థితిగతులను తెలుసుకోవాలని, పంటనష్టాలను నమోదు చేసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎండిన వరి చేలకు ప్రభుత్వ ఎకరాకు రూ.20వేల నష్టపరిహారాన్ని అందజేసి అన్న దాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీను, లడె రాములు, సాపిడి ఆంజనేయులు, నరేష్‌, లక్ష్మమ్మ, మోటె కిష్టమ్మ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:26 AM

Advertising
Advertising