పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ABN, Publish Date - Mar 03 , 2024 | 11:22 PM
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ 5 సంవత్పరాలలోపు ఉన్న పిల్లలకు చుక్కలు వేయించాలని డి ప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్‌రెడ్డి అన్నారు.
- డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్‌రెడ్డి
- జిల్లాలో పోలియో చుక్కల మందు పంపిణీ
జడ్చర్ల, మార్చి 3 : పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ 5 సంవత్పరాలలోపు ఉన్న పిల్లలకు చుక్కలు వేయించాలని డి ప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో, మండలంలోని వివిధ గ్రామాలలో పోలియో చుక్కల మందు పంపిణీ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన పట్టణంలోని ట్రాన్సిట్ పాయింట్ బ స్టాండ్‌లో, అలాగే హైరిస్క్ ఏరియాలో పరిశీలించారు. అనంతరం పిల్లల కు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో స్టేట్ పల్స్ పోలియో మాని టర్స్ రామాంజనేయులు, డాక్టర్ శివకాంత్, సూపర్‌వైజర్స్ పాల్గొన్నారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
రాజాపూర్ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న 0-5 సంవత్సరాల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మండల వైద్యాధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన వైధ్యసిబ్బందితో కలిసి ప్రారంభించారు. ప్రతీ చిన్నారికి ఖచ్చితంగా పోలియో చుక్కల మందు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశ కార్యక ర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 11:22 PM