ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత

ABN, Publish Date - Feb 05 , 2024 | 03:55 AM

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. సాగునీటి అవసరాలకు పాలేరు నుంచి పాతకాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిరాకరించడంతో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు.

స్వయంగా గేట్లెత్తి పాలకాల్వకు నీటిని విడుదల చేసిన రైతులు..

పోలీసుల సహకారంతో గేట్లు మూసిన అధికారులు

కూసుమంచి, ఫిబ్రవరి 4: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. సాగునీటి అవసరాలకు పాలేరు నుంచి పాతకాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిరాకరించడంతో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు. నీటిపారుదల శాఖ సిబ్బంది నుంచి తాళాలు లాక్కోని రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి పాత కాల్వలోకి నీటిని విడుదల చేశారు. నిజానికి, యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు పాత కాల్వకు నీళ్లు విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్‌ డ్యాం నుంచి పాలేరు జలాశయానికి ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాలేరు జలాశయం నీటిమట్టం 15 అడుగులకు చేరుకోగా పాతక్వాల పరిధిలోని రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని పాతకాల్వకు నీటిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని నీటిపారుదల శాఖ అధికారులను హెచ్చరించారు. కానీ స్పందన లేకపోవడంతో సిబ్బంది నుంచి తాళాలు లాక్కోని స్వయంగా గేట్లెత్తి పాత కాల్వలోకి నీటిని విడుదల చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. రిజర్వాయర్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎత్తిన గేట్లను మూయించారు. కాగా, ప్రస్తుతం పాలేరు జలాశయం నుంచి ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు తాగు నీటిని అందిస్తున్నామని, అందువల్ల సాగునీటిని ఇవ్వలేమని అధికారులు తెలిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. అయితే, పాలేరు పాతకాల్వ పరిధిలో సుమారు 15వేల ఎకరాల్లో వరి, చెరుకు సాగవుతోందని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని రైతులు తెలిపారు. తక్షణమే నీటిని విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యను అర్థం చేసుకుని నీటి విడుదలకు చొరవ తీసుకోవాలని కోరారు. పాత కాల్వకు నాలుగు రోజుల పాటు కనీసం 50 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని వేడుకున్నారు.

Updated Date - Feb 05 , 2024 | 03:55 AM

Advertising
Advertising