ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మండలానికో ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’

ABN, First Publish Date - 2024-02-11T04:44:18+05:30

అధునాతన సౌకర్యాలతో ప్రతీ మండలంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పేరిట ఓ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం

బడ్జెట్‌లో రూ.500 కోట్ల కేటాయింపులు

విద్యారంగానికి రూ.21,389 కోట్లు

వర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): అధునాతన సౌకర్యాలతో ప్రతీ మండలంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పేరిట ఓ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తంగా విద్యా రంగానికి రూ.21,389 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఎస్సీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ.1000 కోట్లు, ఎస్టీ గురుకుల భవనాలకు రూ.250కోట్లు, బీసీ గురుకుల భవనాలకు రూ.1546కోట్లు కేటాయించారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా కొత్తగా రెండు ఎంబీఏ కాలేజీల ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునీకరించనున్నారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించారు. కాగా, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక, బడ్జెట్‌లో విద్యారంగానికి నామమాత్రపు కేటాయింపులే దక్కాయని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2024-02-11T04:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising