ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సంఘ వ్యతిరేకులపై కఠినంగా వ్యవహరించండి

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:59 PM

సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ హర్షవర్ధన్‌ ఆదేశించారు.

బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌

- ఎస్పీ హర్షవర్ధన్‌

- ఫిర్యాదులు స్వీకరణ

మహబూబ్‌నగర్‌, మార్చి 4: సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ హర్షవర్ధన్‌ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సీరియస్‌గా వ్యవహరించాలని సూచించారు. సోమవారం ప్రజాఫిర్యాదులను పురస్కరించుకుని ఎస్పీ తన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల ఫిర్యాదులు తీసుకున్న ఆయన వారితో సమస్యపై చర్చించారు. వెంటనే సంబంధిత స్టేషన్‌ అధికారికి ఫోన్‌లో మాట్లాడి కేసు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధికి లోబడి సమస్యను వెంటనే పరిష్కరిం చి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయా లని సూచించారు. పోలీసు సహాయం కావాలనుకే వాళ్లు నిర్భయంగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి తమ సమస్యల.పై ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - Mar 04 , 2024 | 10:59 PM

Advertising
Advertising