ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వెండి జోడు సేవోత్సవం

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:29 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి జోడు సేవోత్సవం వైభవంగా నిర్వహించారు.

వెండి జోడు సేవోత్సవం

నిత్య ఆదాయం రూ.32.87 లక్షలు

5న హుండీ కానుకల లెక్కింపు

యాదగిరిగుట్ట, మార్చి 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి జోడు సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. సుప్రభా తంతో స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు పంచామృతాలతో అభి షేకించి తులసీదళాలతో సహస్రనామార్చనలు చేశారు. ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలను ఆగమ శాస ్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం వేళలో అలంకార వెండి జోడు సేవలు, దర్భారు సేవోత్సవం, సహస్ర నామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, యాగశాలలో రుద్ర హవన పూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. లక్ష్మీనృసింహుడిని 25వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.32,87,732 ఆదాయం సమకూరింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించే కానుకలను ఈ నెల 5వ తేదీన లెక్కించనున్నట్లు దేవస్థాన ఈవో రామకృ ష్ణారావు శనివారం ప్రకటనలో తెలి పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సం దడి నెలకొంది. క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కు పూజల్లో పాల్గొన్నారు. దీంతో సేవా మండపాలు, తిరువీధులు, ఘాట్‌ రోడ్‌ ప్రాంతాలు సందడిగా మారాయి. స్వామివారి ధర్మదర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు అరగంట సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:29 AM

Advertising
Advertising