శంభో.. శంకర...
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:04 PM
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఊరూవాడా, గుళ్లూ, గోపురాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివాలయాలకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని పూజలు నిర్వహించారు. శివలింగాలకు అభిషేకాలు చేశారు. పూలు, పండ్లతో మంచెత్తారు. ప్రసిద్ధ కీసరగుట్ట రామలింగేశ్వరాలయం, వికారాబాద్ బుగ్గ రామలింగేశ్వర, తాండూరు మండలం భూకైలాస్ ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉపవాస దీక్షలున్న భక్తులు సాయంత్రం స్వామి వారి దర్శనానంతరం దీక్ష విరమించారు. రాత్రి పొద్దుపోయే వరకు పూజలు కొనసాగాయి.
మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో శివాలయాలకు భక్తుల తాకిడి
ఉదయం నుంచి రాత్రి వరకూ గుళ్ల వద్ద కోలాహలం
స్వామి వారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
సాయంత్రం ఆలయాల వద్ద ఉపవాస దీక్షల విరమణ, రాత్రంతా జాగారం
కీసరగుట్టలో ఆన్‌లైన్ దర్శన సేవలకు స్పందన నామమాత్రం..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఊరూవాడా, గుళ్లూ, గోపురాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివాలయాలకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని పూజలు నిర్వహించారు. శివలింగాలకు అభిషేకాలు చేశారు. పూలు, పండ్లతో మంచెత్తారు. ప్రసిద్ధ కీసరగుట్ట రామలింగేశ్వరాలయం, వికారాబాద్ బుగ్గ రామలింగేశ్వర, తాండూరు మండలం భూకైలాస్ ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉపవాస దీక్షలున్న భక్తులు సాయంత్రం స్వామి వారి దర్శనానంతరం దీక్ష విరమించారు. రాత్రి పొద్దుపోయే వరకు పూజలు కొనసాగాయి.
వికారాబాద్/ూమేడ్చల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కీసర, మార్చి 8: వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని దేవాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. హరహర మహదేవా... అంటూ శివనామ స్మరణతో భక్తులు పరవశించిపోయారు. ఉదయం నుంచి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు శివాలయాల్లో ఓంకార స్వరూపుడైన శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మహశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కీసరగుట్టకు భక్తజనం పోటెత్తింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శించుకున్నేందుకు బారులు తీరారు. గురువారం రాత్రి స్వామివారి కల్యాణ ఆనంతరం గర్భాలయ ద్వార బంధనం చేసిన ఆనంతరం తెల్లవారు జామున 3.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆలయ నిర్వహకులు గర్భాలయంలోని మూల విరాట్‌కు మాఘ బహుళ త్రయోదశి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, యాగశాలలో రుద్ర స్వాహకార హోమం నిర్వహించారు. ఉదయం పది గంటల వరకు భక్తుల తాకిడి పెరిగింది. సాయంత్రం ఉపవాస దీక్షల ఆనంతరం భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 10 గంటలకు భజనలు, సంతతధారాభిషేకము తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.
కనుల పండువగా స్వామివారి కల్యాణం
శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రవణ నక్షత్ర యుక్త తులలగ్నమందు ఉత్సవమూర్తులకు ఆలయగోపురం ఎదురుగా ఉన్న మండపంలో కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు స్వామివారి కల్యాణానికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదములు, ఆశీర్వచనలు అందజేశారు.
స్వామివారి సేవల్లో ప్రముఖులు
శివరాత్రి పురస్కరించుకొని పలువురు ప్రముఖులు కీసరగుట్ట రామలింగేశ్వరుడి దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కూమార్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డి, బీజేపీ సీనియర్ నాడుకు ఈటల రాజేందర్ దంపతులు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం, న్యాయమూర్తులు, అధికారులు విచ్ఛేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల ఇబ్బందులు
శివరాత్రి రోజున స్వామివారి దర్శనానికి కీసరగుట్టకు విచ్చేసిన భక్తులకు అధికారులు చుక్కలు చూపించారు. వీఐపీ పాసుల దర్శనం క్యూలైన్, శీఘ్ర దర్శనం (రూ.500టిక్కెట్) క్యూలెన్‌లో వచ్చే భక్తులు ముందుగా వేర్వేరులైన్లలో రాగా, కొద్ది దూరం వెళ్లాక ఒకే చోట కలిసిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. అదే విధంగా క్యూలెన్లు మొత్తం చలువ పందిళ్లు వేసి కప్పెయడంతో తీవ్ర ఉక్కపోతతో భక్తులు నానా ఆవస్థలు పడ్డారు.ు
అన్నదానాలు
కీసరగుట్టలో భక్తులకు పలు స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు అన్నదానాలు చేఽశారు. భక్తులతో పాటు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి రెడ్డిసంక్షేమ, ఆర్యవైశ్య, వంశరాజ్, మున్నూరుకాపు సంఘాలు, మర్వాడీ మిత్ర మండలి అధ్వర్యంలో అన్నదానాలు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రం నిర్వాహకులు వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు ఏసీపీ నరేందర్ గౌడ్ వాటిని ప్రారంభించారు.
శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
వికారాబాద్ సమీపంలోని బుగ్గ శ్రీరామలింగేశ్వరస్వామి, పులుసుమామిడిలోని పార్వతీ పరమేశ్వర, కులకచర్ల మండలంలోని పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయం, పూడూరు మండలంలోని దామగుండం రామలింగేశ్వరస్వామి, నీళ్లపల్లి ఏకాంబరేశ్వరస్వామి, తాండూరు సమీపంలోని అంతారం భూకైలాస్, పాత తాండూరులోని కోటేశ్వరస్వామి, ఎల్లకొండలోని పార్వతీ పరమేశ్వర, దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో చేవెళ్ల మాజీ ఎంపీకొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూడూరు మండలం, దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సతీమణితో కలిసి పూజలు నిర్వహించారు. తాండూరు మండలం, భూకైలా్‌సలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - Mar 08 , 2024 | 11:04 PM