బోటానికల్ గార్డెన్ సందర్శన
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:04 AM
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం జడ్చర్ల పట్టణంలోని తెలంగాణ బోటానికల్ గార్డెన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు.
జడ్చర్లలో బోటానికల్ గార్డెన్‌ను సందర్శించిన విద్యార్థులు
కొడంగల్ రూరల్, ఫిబ్రవరి 29: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం జడ్చర్ల పట్టణంలోని తెలంగాణ బోటానికల్ గార్డెన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. బోటానికల్ గార్డెన్ సమన్వయ కర్త సదాశివయ్య విద్యార్థులకు వివిధ రకాల మొక్కలు, జంతువులు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు రఫీయాఖానమ్, శ్రీనివాస్, జంతుశాస్త్ర అధ్యాపకుడు రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:04 AM