ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీటిగుంతలో పడి బాలిక మృతి

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:12 AM

వ్యవసాయ పొలంలో ఉన్న నీటిగుంతలో పడి మతిస్థిమితం లేని బాలిక(10) మృతి చెందిన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇక్కరెడ్డిగూడ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

చేవెళ్ల, మార్చి 2 : వ్యవసాయ పొలంలో ఉన్న నీటిగుంతలో పడి మతిస్థిమితం లేని బాలిక(10) మృతి చెందిన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇక్కరెడ్డిగూడ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీ్‌సలు, గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన మత్తయ్య, సారమ్మ పది సంవత్సరాల కిత్రం బతుకుదెరువు కోసం షాబాద్‌ మండల పరిధిలోని నాగర్‌గూడకు వచ్చి ఆ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు, వారిలో చిన్న అమ్మాయి బేబీకి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో పాఠశాలకు పంపిండచం లేదు. దీంతో తల్లి ఎక్కడికి పనికి వెళితే అక్కడికి ఆమెతో పాటు పాపను తీసుకువెళ్లేది. శనివారం కూడా తన వెంట బేబీని తీసుకొని సారమ్మ కూలీకి వెళ్లింది. సాయంత్రం 5 గంటల సమయంలో కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా దొరకకపోవడంతో నీటిగుంతలో చూడగా అందులో పడిఉన్న బేబీ అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందించడంతో పోలీ్‌సలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమాఠం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ్‌సలు చెప్పారు.

Updated Date - Mar 03 , 2024 | 12:12 AM

Advertising
Advertising