ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబు

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:00 AM

రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ఆపద మొక్కుల దైవంగా బాసిల్లుతున్న కడ్తాల మండలం మైసిగండి శివాలయంలో శ్రీకాశీవిశ్వనాథస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను గురువారం ఈవో స్నేహలతతో కలిసి ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ ప్రారంభించారు.

ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు

ఘనంగా బ్రహ్మోత్సవాలు

కడ్తాల్‌/తలకొండపల్లి/ఆమనగల్లు/మహేశ్వరం/కేశంపేట/షాద్‌నగర్‌రూరల్‌/చేవెళ్ల/షాద్‌నగర్‌, మార్చి 7: రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ఆపద మొక్కుల దైవంగా బాసిల్లుతున్న కడ్తాల మండలం మైసిగండి శివాలయంలో శ్రీకాశీవిశ్వనాథస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను గురువారం ఈవో స్నేహలతతో కలిసి ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవతో కాశీవిశ్వనాథ స్వామికి మేలుకొలుపు పాడారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలోని వేదాద్రి గుట్టపై గల శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా జరిగింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌లు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ యాదవ్‌-సంగీత దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఆమనగల్లు మండలం మైసిగండి శివాలయంలో శివపార్వతుల కల్యాణానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. జాగరణ చేసే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత చెప్పారు. మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. గురువారం గణపతి పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ అల్లె కుమార్‌, ఇన్‌చార్జి ఎంపీపీ ఆర్‌.సునీతా అంద్యానాయక్‌, మాజీ చైర్మన్లు నాయకులున్నారు. కేశంపేట మండలం కాకునూర్‌ గ్రామ శివారులో వెలసిన మహాలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫరూఖ్‌నగర్‌ మండలం రామేశ్వరం రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శివకుమార్‌ తెలిపారు. చేవెళ్ల లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ దేవస్థానం మేనేజర్‌(ఈవో) నరేందర్‌, ధర్మకర్తలు శ్రీకాంత్‌చారి, శ్రీపాదు తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో శ్రీ శాస్త్రలింగేశ్వర వీరాంజనేయస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం జరిగింది.

Updated Date - Mar 08 , 2024 | 12:00 AM

Advertising
Advertising