ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:01 AM

హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలను తయారుచేయాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు.

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 29 : హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలను తయారుచేయాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని మసూల్‌దార్‌ మండి, పల్లెరుచులు, మన రెస్టారెంట్‌ హోటల్‌ళ్లను ఆయన తనిఖీ చేశారు. రెండు రోజుల నుంచి ఫ్రిడ్జ్‌లో చికెన్‌ నిల్వ ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడకపెట్టిన గుడ్లు పదుల సంఖ్యల్లో నిల్వ ఉంచడంతో పాటు హోటళ్లలో అపరిశుభ్రత, సిబ్బంది శుభ్రత పాటించకపోవడంతో మసూల్‌దార్‌ మండి హోటల్‌కి రూ.40వేలు, పల్లెరుచులు హోటల్‌కి రూ.30వేల జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ ఫుడ్‌సేఫ్టీ రూల్స్‌ ప్రకారం హోటల్‌ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. సిబ్బంది అంజన్‌కుమార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:02 AM

Advertising
Advertising