ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:14 AM

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి

షాబాద్‌, ఫిబ్రవరి 24 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి తెలిపారు. పట్నం రాజేందర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలను బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని యువత క్రీడల్లో రాణించేందుకు రాజేందర్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయం మేరకు షాబాద్‌లో పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియం ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. గ్రామీణ యువకులు క్రీడల్లో రాణించి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. క్రీడా కారులకు సహాయసహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు మద్దూరి పాండు, రమేష్‌యాదవ్‌, రాంచంద్రారెడ్డి, సుదర్శన్‌, శివకుమార్‌, మాజీ సర్పంచులు దర్శన్‌, కృష్ణగౌడ్‌, చంద్రశేఖర్‌, జంగయ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 10:11 AM

Advertising
Advertising