బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:12 AM
నందిగామ పోలి్‌సస్టేషన్ పరిధిలోని చంద్రాయన్‌గూడ శివారులో పాత జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.
నందిగామ, మార్చి 2 : నందిగామ పోలి్‌సస్టేషన్ పరిధిలోని చంద్రాయన్‌గూడ శివారులో పాత జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన బీకారాం చౌదరి(41) వరంగల్‌లో నివాసముంటాడు. తన ద్విచక్రవాహనంపై షాద్‌నగర్‌లో ఉన్న తన అన్న శంకర్‌లాల్ దగ్గరకు వెళ్తుండగా చంద్రాయన్‌గూడ వద్ద అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బీకారాం చౌదరి తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న శంకర్‌లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 12:13 AM