అసైన్డ్ భూ బాధితులతో మానవహక్కుల వేదిక బృందం సమావేశం
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:28 AM
మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో చేపట్టనున్న మెడికల్ కళాశాల నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
కొడంగల్ రూరల్, మార్చి 3: మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో చేపట్టనున్న మెడికల్ కళాశాల నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు అప్పాయిపల్లిలో రైతుల అభిప్రాయాలను సేకరించారు. సర్వే నెం.19లోని 75 ఎకరాల భూమిని 1972లో 47 కుటుంబాలకు జీవనాధారంగా అసైన్డ్ పట్టాలు అందించడం జరిగిందని రైతులు తెలిపారు. ఆరోజు సాగుకు అను కూలంగా లేకుండా బండలు, రాళ్లు, రప్పలతో కూడిన భూములను కొన్నేళ్ల పాటు కష్టపడి సాగు యోగ్యంగా చేసుకొని మూడు తరాలుగా జీవనాధారం పొందుతున్నట్లు తెలిపారు. ఆ భూముల్లో బోర్లు, బావులు లాంటి వ్యక్తిగత సాగునీటి సౌకర్యాలు కల్పించుకొని ఆ భూమే ఏకైక జీవనాధారంగా దాదాపు 150 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నట్లు రైతులు తెలిపారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పేద, బలహీన వర్గాల భూములను తీసుకోకుండా భూస్వాముల దగ్గర తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే భూములను తీసుకోమని అధికారులు ప్రకటన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కర్త వసంతలక్ష్మీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ఆదంరాజు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్, వెంకటనారాయణ, రోహిత్, మధు, వివిధ ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నాగిరెడ్డి, ఏర్పుల చంద్రప్ప, ఎం.వెంకటయ్య, బుస్స చంద్రయ్య, కొత్తూర్ చంద్రయ్య, శ్రీనివాస్, సూర్యనాయక్, యు.రమేశ్‌బాబు, దస్తప్ప, బలరాం, లక్ష్మయ్య పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 12:28 AM