వైభవంగా పోలెపల్లి జాతర
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:00 AM
తెలంగాణలో మినీ మేడారంగా పిలవబడే దుద్యాల మండలంలోని పోలెపల్లి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
బొంరాస్‌పేట్, మార్చి 2: తెలంగాణలో మినీ మేడారంగా పిలవబడే దుద్యాల మండలంలోని పోలెపల్లి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి రథోత్సవం కనుల పండగగా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ దేవతను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జయకృష్ణ, రాజేశ్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ తరపున వారిని సన్మానించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం ప్రధాన ఘట్టం రథోత్సవం, అంతకు ముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చుక్క బోనంతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పూణె, షోలాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎల్లమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
Updated Date - Mar 03 , 2024 | 12:00 AM