ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇబ్బందులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకోవద్దు

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:18 AM

కాంగ్రెస్‌ పార్టీని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోరాదని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.

కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న జడ్పీ చైౖర్‌పర్సన్‌ సునీతారెడ్డి

తాండూరు, మార్చి 7: కాంగ్రెస్‌ పార్టీని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోరాదని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులోని జీపీఆర్‌ గార్డెన్‌లో గురువారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీలో చేరికలు ఎమ్మెల్యే సమక్షంలో జరుగుతాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో తమనూ ఇబ్బందులు పెట్టారని గుర్తుచేశారు. డైనమిక్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో అన్నిస్థానాలు కాంగ్రెస్‌ గెలుస్తుందని.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ముందే నమ్మకం ఉన్నప్పటికీ.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి నమ్మలేదని గుర్తుచేశారు. జిల్లా అభివృద్ధికి తాను ఎన్నో నిధులు మంజూరు చేశానని తెలిపారు. జడ్పీచైర్మన్‌ పదవి కన్నా ఎంపీ పదవి చిన్నదేనని తెలిపారు. తాను ఎంపీనైనా అందుబాటులో ఉంటూ సామాన్య కార్యకర్తగా పని చేస్తానని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి మొదటగా కాంగ్రెస్‌ పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేస్తామని, పార్టీలోకి వచ్చేవారిని గ్రామ కమిటీ సూచన మేరకు చేర్చుకుంటామని తెలిపారు. తాండూరు మీదుగా రెండు జాతీయ రహదారులు వస్తున్నాయని తెలిపారు. మూడు నెలల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రూ.107కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, వారి కృషివల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, జడ్పీటీసీ ధారాసింగ్‌, మాజీ జడ్పీటీసీ రాకేష్‌, మహిపాల్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ రవిగౌడ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అవినీతి నేతలకు కాంగ్రె్‌సలో నో ఎంట్రీ

మేడ్చల్‌ టౌన్‌: మేడ్చల్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డితో సహా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలకు తమ పార్టీలోకి ప్రవేశంలేదని కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వజ్రేష్‌ యాదవ్‌ అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ స్థలిలో గురువారం నిర్వహి ంచిన విలేకరుల సమావేశంలో వజ్రే్‌షయాదవ్‌ మాట్లాడారు. గత పదేళ్లుగా ప్రజలను పట్టి పీడించి దోచుకున్న బీఆర్‌ఎస్‌ అవినీతి నేతల భరతం పడుతున్నామన్నారు. ప్రస్తుతం అవినీతి చరిత్ర గల నేతలు తమ పార్టీలో చేరటానికి రాయబారం నడుపుతున్నారన్నారు. ఇలాంటి నేతలకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ప్రవేశం ఉండబోదన్నారు. అధికారం అనుభవించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని నియోజకవర్గంలోని పలువురు నేతలు రాజకీయ కార్యకలాపాలు చేపట్టారని తెలిపారు. ఇలాంటి నేతలకోసం తమ పార్టీ ద్వారాలు పూర్తిగా మూసి వేశామన్నారు.నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల అవినీతి చిట్టాను మెల్లమెల్లగా విప్పనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్‌, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, బైరి ఈశ్వర్‌, వేముల శ్రీనివాస్‌ రెడ్డి, రమణారెడ్డి, నారెడ్డి కొండల్‌ రెడ్డి, బాల్‌రెడ్డి, మహిపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:18 AM

Advertising
Advertising