ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలి
ABN, Publish Date - Feb 21 , 2024 | 12:13 AM
పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలోని 530 సర్వేనంబరులో భూముల వివరాలను సేకరించాలని వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి సూచించారు.
పరిగి, ఫిబ్రవరి 20: పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలోని 530 సర్వేనంబరులో భూముల వివరాలను సేకరించాలని వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి సూచించారు. పరిగి తహసీల్దార్ కార్యాయలంలో మంగళవారం రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 530 సర్వేనంబర్‌లో 370ఎకరాల భూమి ఉందని, అయితే ఇందులో ప్రభుత్వ సంస్థలకు ఎంత కేటాయించారో తేల్చాలాని సూచించారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వగా, ఇంకా ఎంత భూమి ఉందో వివరాలు సేకరించాలని సూచించారు. మున్సిపాలిటీ నుంచి రెండు, రెవెన్యూ నుంచి నాలుగు బృందాలు ఏర్పడి ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. ఈ సర్వేనంబరులో ఇక నుంచి ఇళ్ల నిర్మాణాలకు, విద్యుత్ కనెక్షన్‌లకు అనుమతులు ఇవ్వరాదని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, మల్లిఖార్జున్, విద్యుత్ ఏఈ ఖాజా పాల్గొన్నారు.
Updated Date - Feb 21 , 2024 | 12:13 AM