ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇక ప్రజాపాలన సేవా కేంద్రాలు

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:15 AM

ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

గ్యారంటీల ఆమలుకు కొత్తగా ఏర్పాటు

నేటి నుంచి మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ప్రారంభం

వికారాబాద్‌ జిల్లాలో 30 సెంటర్లు ఏర్పాటు

తాండూరులో 4, వికారాబాద్‌లో 4, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో

రెండేసి చొప్పున 4, మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు

వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సరిచేయడం, సందేహాల నివృత్తి,

నూతన దరఖాస్తులు స్వీకరించనున్న అధికారులు

తాండూరు, మార్చి3 : ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈనెల 4వ తేదీ సోమవారం నుంచి ప్రజాపాలన సేవా కేంద్రాలను మండల కేంద్రం, మున్సిపాలిటీలు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించడానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలున్నాయి. తాండూరులో నాలుగు, వికారాబాద్‌లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలో రెండేసి చొప్పున ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 18 ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు ప్రింటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా ప్రజాపాలన వెబ్‌ పోర్టల్‌ను ిసీసీజీ ద్వారా అమలు చేయనున్నారు. ఈడీఎంఎస్‌ , డీఈవోలకు శిక్షన కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఆపరేటర్లకు లాగిన్‌లను కలెక్టరేట్‌ నుంచి ఇస్తారు. అక్కడి నుంచే అధికారులు పర్యవేక్షించనున్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మీ, ఈ కేంద్రాల్లో ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న పథకాల్లో సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. అంతేకాకుండా వచ్చిన దరఖాస్తులో తప్పులను సరిచేయడంతో పాటు దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఈ కేంద్రాలలో గృహా జ్యోతి, మహలక్ష్మీ పథకాలను సంబంధించిన దరఖాస్తులో సందేహాలుంటే సిబ్బంది క్లియర్‌ చేయనున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:15 AM

Advertising
Advertising