ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సర్కారు స్థలాల్లో ప్రైవేటు దందా!

ABN, Publish Date - Feb 21 , 2024 | 11:31 PM

సర్కారు స్థలాలు అక్రమార్కులకు వ్యాపార కేంద్రాలుగా మారాయి. హెచ్‌ఎండీఏ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొందరు నాయకులు రాత్రికి రాత్రే హోర్డింగులు ఏర్పాటు చేసి వ్యాపార ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ స్థలాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అక్రమార్కుల వైపు అటు హెచ్‌ఎండీఏ, ఇటు మునిసిపల్‌ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.దీంతో సర్కారు ఆదాయానికి భారీ గండి పడుతోంది. పొట్టకూటి కోసం రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసే వారిపై మాత్రం తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆగ మేఘాల మీద వారిని ఖాళీ చేయిస్తున్నారు.

ఘట్‌కేసర్‌లోని ఔటర్‌ చౌరస్తా వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

జోరుగా వ్యాపారాలు

భారీ హోర్డింగులు.. అదే స్థాయిలో అద్దెలు

పట్టించుకోని హెచ్‌ఎండీఏ అధికారులు

పెద్దలను వదిలి.. చిరువ్యాపారులపై ప్రతాపం

అక్రమ హోర్డింగుల తొలగింపులో దోబూచులాట

సర్కారు స్థలాలు అక్రమార్కులకు వ్యాపార కేంద్రాలుగా మారాయి. హెచ్‌ఎండీఏ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొందరు నాయకులు రాత్రికి రాత్రే హోర్డింగులు ఏర్పాటు చేసి వ్యాపార ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ స్థలాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అక్రమార్కుల వైపు అటు హెచ్‌ఎండీఏ, ఇటు మునిసిపల్‌ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.దీంతో సర్కారు ఆదాయానికి భారీ గండి పడుతోంది. పొట్టకూటి కోసం రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసే వారిపై మాత్రం తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆగ మేఘాల మీద వారిని ఖాళీ చేయిస్తున్నారు.

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 21: ఘట్‌కేసర్‌లో ఔటర్‌ సర్వీసు రోడ్డు కోసం హెచ్‌ఎండీఏ సేకరించిన స్థలాలు కొందరు నాయకులకు వ్యాపార కేంద్రాలుగా మారాయి. రోడ్లకు ఇరువైపుల భారీ ఫిల్లర్లు నిర్మించి ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రికిరాత్రే హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని రోడ్డు స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధ్దంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ స్థలాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన వారి జోలికి వెళ్లకుండా రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసే వారిపై అధికారుల తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆగ మేఘాల మీద వారిని ఖాళీ చేయిస్తున్నారు. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి కలిసే చోట అన్నోజిగూడ వైపున ఔటర్‌ సర్వీసు రోడ్డు పక్కన ఇటీవల చిరు వ్యాపారులు టీ కొట్టుతో పాటు, భోజనం కోసం చిన్న డబ్బాను ఏర్పాటు చేసుకున్నారు. ఇంకేముంది హెచ్‌ఎండీఏ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో వచ్చి తక్షణమే ఈ స్థలాన్ని ఖాళీ చేయాల ఆదేశించారు. చేసేదేమీలేక ఆ చిరువ్యాపారుల్లో ఒకరు డబ్బాతో సహా ఖాళీ చేసి వెళ్లి పోగా, మరొకరు డబ్బాను మూసి వేశాడు. ఇక్కడ ఇంత కఠినంగా వ్యవహరించిన హెచ్‌ఎండీఏ అధికారులు ఘట్‌కేసర్‌ వైపు మళ్లే చౌరస్తాలో మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ భారీగా దుకాణాలున్నాయి, అక్రమంగా హోర్డింగులు వెలిశాయి. అయినా అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమ హోర్డింగులపై హెచ్‌ఎండీఏ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మూడు ధపాలుగా అధికారులు యంత్రాలలో రావడం కొద్ది సేపు అక్కడ హల్‌చల్‌ చేయడం తప్పా చేసిందేమీ లేదు. హోర్డింగులకున్న ఫ్లెక్సీలను తొలగించడం.. ఈ లోపు పై నుంచి ఏదో ఫోన్‌ రావడంతో వెళ్లి పోవడం నిత్యకృత్యంగా మారింది. దీంతో అక్రమార్కులు వెంటనే తిరిగి ఫ్లెక్స్సీలను ఏర్పాటు చేయడం షరామాములుగా మారిపోయింది. ఇప్పటికైన హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించి ఘట్‌కేసర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించి స్వాధీనం చేసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరులవే...

ఘట్‌కేసర్‌లో ఔటర్‌ జంక్షన్‌ కోసం హెచ్‌ఎండీఏ సేకరించిన స్థలంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అండదండలతో ఆయన అనుచరులు కొందరు అక్రమంగా హోర్డింగులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించక పోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ స్థలాల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యాపారాలు అధికారులకు కనింపించడం లేదా?. చిన్నచిన్న నిర్మాణాలకే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులకు ఇక్కడ చూసిచూడనట్లు వ్యవహరించడం విచారకరం

- అబ్బసాని యాదగిరి మాజీ సర్పంచ్‌ ఘట్‌కేసర్‌

తక్షణమే చర్యలు తీసుకోవాలి

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ లో పలు చోట్ల అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలి. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా హోర్డింగులు పెట్టారు. స్థానిక ఎదులాబాద్‌ రోడ్డులో హోర్డింగ్‌ తొలగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిగతా వాటిని అలాగే వదిలేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అటు హెచ్‌ఎండీఏ అధికారులు, ఇటు మున్సిపల్‌ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించాలి

- మేకల పద్మారావు, కౌన్సిలర్‌, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ

Updated Date - Feb 21 , 2024 | 11:31 PM

Advertising
Advertising