Kumaram Bheem Asifabad- ప్రజలు పోలీసులకు సహకరించాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 10:38 PM
సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాపిడ్ యాక్షన్ పోర్స్ కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి.
వాంకిడి మార్చి 3: సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాపిడ్ యాక్షన్ పోర్స్ కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వర్గ భేదాలు, అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవాతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా గొడవలు సృస్టించాలని, చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కవాతు మండలంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 10:38 PM