బుద్ధవనాన్ని సందర్శించిన అటవీశాఖ కన్జర్వేటర్
ABN, Publish Date - Feb 05 , 2024 | 12:29 AM
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అటవీశాఖ యాదాద్రి సర్కిల్ కన్జర్వేటర్ శివానీ డోగ్రా ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు.
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 4: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అటవీశాఖ యాదాద్రి సర్కిల్ కన్జర్వేటర్ శివానీ డోగ్రా ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. తొలుత నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించాక, ఇటీవల నూతనంగా ప్రారంభించిన అటవీశాఖ సఫారీ వాహనంలో అర్బన్ పార్కు ను, నెల్లికల్ అటవీ వ్యూపాయింట్‌ను సందర్శించారు. బుద్ధవనం లో బుద్ధ చరిత వనం, గౌతమబుద్ధుడి పాదాల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతకవ నం, స్తూపవనం, ధ్యానవనాలను సందర్శించి మహాస్తూపంలోని అంతర్భాగంలో ఉన్న ధ్యానమందిరాన్ని వీక్షించారు. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుడి, అతని అనుచరుల అవశేశాలు కలిగి ఉన్న పగోడాను పరిశీలించారు. వారికి స్థానిక టూ రిజం గైడ్ సత్యనారాయణ ఇక్కడి విశేషాలను వివరించారు. ఆమె వెంట నాగార్జునసాగర్ అటవీశాఖ డివిజన్ పరిధిలోని అధికారులు, బుద్ధవనం సూపర్‌వైజర్ విష్ణు ఉన్నారు.
Updated Date - Feb 05 , 2024 | 12:29 AM