అధికారంలోకి రావాలన్న దుగ్ధతోనే కాంగ్రెస్ హామీలు
ABN, Publish Date - Feb 21 , 2024 | 11:57 PM
ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న క్షాంక్షతోనే కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్
యాదగిరిగుట్ట రూరల్ / ఆలేరు రూరల్/ మోటకొండూరు / ఆత్మకూర్(ఎం) / మోత్కూరు / తిరుమలగిరి / నాగారం / తుంగతుర్తి, ఫిబ్రవరి 21 : ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న క్షాంక్షతోనే కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ పెద్దలు, ఎన్నికల సందర్భంగా లెక్కలేనన్ని హామీలు ఎందుకిచ్చినట్లు అని ప్రశ్నించారు. విజయ సంకల్ప్ యాత్రలో భాగంగా రెండో రోజైన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మొదలై ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, తిరుమలగిరి, నాగారం, తుంగతుర్తి వరకు కొనసాగింది. ఈ యాత్రలో ప్రజలనుద్దేశించి రాజేందర్ మాట్లాడారు. మహిళా పథకాలు, రైతు, యూత డిక్లరేషన తదితర పేర్లతో ఇచ్చిన హామీలెన్ని అన్నది బహుశా ఇచ్చిన నాయకులకే గుర్తు లేకపోవచ్చన్నారు. రాష్ట్రంలో సంపదకు కొదవ లేదని ప్రగల్భాలు పలికిన కేసీఆరే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయారన్నారు. చివరకు రింగ్‌రోడ్డు, ప్రభుత్వ భూములు విక్రయించినా రాష్ట్ర అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లించగలిగారని, అసలు కూడా కట్టలేకపోయారన్నారు.
యాత్రలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకే్‌షరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు దాసరి మల్లేశం, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ పాల్గొన్నారు. కేసీఆర్ ఆసరా పింఛన్లు రూ.2 వేలు, దివ్యాంగులకు 3 వేలు ఇవ్వడానికే నానా తంటాలు పడగా సీఎం రేవంతరెడ్డి రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంపై కాకిగోల చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు మాసాలు అవుతున్నా పిల్లర్లు కుంగాయంటున్నారే గానీ అందుకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వచ్చే యేడాది వర్షాలు తక్కువగా కురిస్తే తుంగతుర్తి నియోజక వర్గానికి నీరే రాదన్నారు.
బీజేపీతోనే సుస్థిర పాలన సాధ్యం
దేశంలో బీజేపీతోనే సుస్థిరపాలన సాధ్యమని ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ మోత్కూరులో చేనేత కార్మికులు ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
నాగారం మండల కేంద్రంలో సభ నిర్వహణ లేకపోవడంతో అభిమానులకు బీజేపీ నాయకులు అభివాదం చేసుకుంటూ వెళ్లారు.
Updated Date - Feb 21 , 2024 | 11:57 PM