ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కిటకిటలాడిన నార్కట్‌పల్లి బస్టాండ్‌

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:11 AM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది.

ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్‌

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 25 : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. మేడారం జాతరకు బస్సు సర్వీసులను పంపించారు. దీంతో బస్సుల కొరతతో బస్‌స్టేషనకు ఏ రూట్‌ నుంచి వచ్చిన బస్సైనా ప్రయాణికులతో కిక్కిసిరి కనిపించాయి. ఏబస్సులో చూసినా 90 శాతం మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు. ఆదివారం సెలవురోజు కావడం శుభకార్యాలు ఎక్కు వగా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. చంటిపిల్లలు, చేతి సంచులు, బ్యాగులతో మహిళలు బస్సులు ఎక్కలేక, గమ్యస్థానాల్లో దిగలేక నానాఅగచాట్లు పడ్డారు. నార్కట్‌పల్లి బస్టాండ్‌ నుంచి నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్‌, భువనగిరి రూట్లలో వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసాయి. బస్సు ఫుట్‌బోర్డు వరకు నిలబడి వేలాడుతూ ప్రమాదం అంచున ప్రయాణించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు వాహనాల్లో వెళ్దామనుకున్నా అవీ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులతో నార్కట్‌పల్లి బస్టాండ్‌ ప్రాంగణం కిటకిటలాడింది.

Updated Date - Feb 26 , 2024 | 12:11 AM

Advertising
Advertising